Sunday, 20 September 2015

మీ ప్రార్ధన ఎలా ఉంది?

ప్రార్ధన చాలా విశాలమైనది. ఆత్మీయ జీవితంలో విస్తృతమైనది. ప్రార్ధన వినీల ఆకాశాన్ని చేధించుకుని పరలోకమందున్న ప్రభువును చేరునంత తొందరగా ఏ స్పేస్‌షటిల్‌ పయనించలేదు! ప్రార్ధన చుట్టిరాని ప్రదేశం లేదు, చేయలేని కార్యం లేదు, అందుకే బైబిల్లో ప్రార్ధన యొక్క ప్రాముఖ్యత ప్రతిబింబిస్తుంది. విశ్వాసి ప్రార్ధన జీవితం ఘనంగా మరియు బలంగా ఉండాలి. ప్రార్ధన పఠించేది లేక పలికేది కాదు దానిని వ్యక్తిగతంగా అనుభవించాలి. చిన్న పిల్లల ప్రార్ధన పెద్దల ప్రార్ధనలో వ్యత్యాసం ఉంది. పిల్లల ప్రార్ధనలో లోతు ఉండదు (1 కొరింథీ 13:11). ప్రార్ధన జీవితంలో ఎదుగుదల, పరిపక్వత అత్యవసరం. ప్రార్ధనలో ప్రజలు వేరు వేరు స్థాయిలలో అనుభవాలు కలిగియుంటారు. అందరూ ఓడలో ఉన్నా అందరూ ఒకే అంతస్థులో లేరు! కొందరిది చీలమండ లోతు, కొందరిది మోకాళ్ళ లోతు, కొందరిది మొల లోతు, కొందరిది మునిగిపోయే లోతు అనుభవంగా ఉంటుంది (యెహెజ్కేలు 47:3-5).

మీ ప్రార్ధన జీవితాన్ని పెంచుకోవాలి, పటిష్టం చేసుకోవాలి, ఫలింపజేయాలి. 'నీ ప్రార్ధన దోనెను లోతునకు నడిపించుమని' ప్రభువు సెలవిచ్చిన తరువాత దానిని అంత సుళువుగా తీసుకోకూడదు. మీ ప్రార్ధన అనుభవంలో ఈ విషయాలు కలవా? పరిశీలించండి. లేకపోతే వెంటనే ప్రారంభించండి.

1) దీవెనల కొరకు ప్రార్ధించుట నుండి దీవించు దేవుని సన్నిధి కొరకు ప్రార్ధించునట్లు ఎదగాలి : కొందరి నోట 'దేవా, నన్ను దీవించు' అన్న మాటలు తప్ప మరేవి రావు! ఎంతసేపు దీవెనలపై ధ్యాసే తప్ప దీవించు దేవుని పై ససేమిరా మనస్సు ఉండదు. దీవెనలు కోరుట తప్పుకాదు. యాకోబు, యబ్బేజులు దీవెన కోరి దీవించబడ్డారు. అయితే వారు మొదట దీవెన కర్తను కాంక్షించారు. దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఆశీర్వాదాలు ఇస్తాడు. మనం వాటి కొరకు ప్రార్ధనలో అడగవచ్చని వాక్యం చెబుతోంది. కాని మన ప్రార్ధనలో అది ప్రధానమైన విషయం కాదు. కొందరు జలగల్లాగా 'ఇమ్ము, ఇమ్ము' అనే మొఱ్ఱ పెడుతుంటారు. వారికి ఆ వ్యక్తిపై శ్రద్ధలేదు ఆయన ఇచ్చే వస్తువులపైనే శ్రద్ధ. వారికి భగవంతుడు కాదు కావాల్సింది, ఆయన యొద్ద దొరికే బంగారం! దేవుని ప్రేమించక ఆయన ఇచ్చే యీవుల కొరకు పరితపించడం ఘోరం.

ప్రార్ధనలో ప్రభువుతో 'సహవాసం' మొదట, ఆ తరువాతే ప్రభువు 'సహాయం'ఉండాలి. ఆయన స్వాస్థ్యం కన్నా ఆయన సన్నిధిని కాంక్షించాలి. 'దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది (కీర్తన 42:1) '....జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది' (కీర్తన 84:2). 'ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగ లోకములోనిది ఏదియు నా కక్కరలేదు (కీర్తన 73:25). భక్తులు ప్రభువును కోరుకున్నారు ఆయన సన్నిధి కొరకు పరితపించారు. పౌలు ప్రభువు సహవాసం కొరకు తనకు లాభకరమైన వాటినన్నిటిని నష్టముగా పెంటగా ఎంచుకున్నాడు. వివేచన గలవారు విలువను గుర్తిస్తారు! దేవుడు నీ ఆత్మకుప్రాణప్రియుడా? లేక నీ అవసరాల పంపిణిదారుడా? విద్యలో ప్రమోషన్‌, ఉద్యోగంలో ప్రమోషన్‌, వ్యాపారంలో ప్రమోషన్‌ లభించినట్లే ప్రార్ధనలో కూడా ప్రమోషన్‌ పొందాలి! భక్తుడైన జాన్‌ హైడ్‌ ప్రభువు సన్నిధిలో గంటల తరబడి నిద్రాహారాలు మరచి గడిపేవాడు.



2) శరీర సంబంధమైన విషయాల కొరకు ప్రార్ధించుట నుండి ఆత్మసంబంధమైన విషయాల కొరకు ప్రార్ధించునట్లు ఎదగాలి : కొందరి ప్రార్ధనలో సమతుల్యత ఉండదు. వారి ప్రార్ధనా జీవితం ఒకవైపు ఒరిగిపోయి ఉంటుంది. ఎప్పుడూ శరీర అవసరతల కొరకే ప్రార్ధిస్తారు. ఆరోగ్యం, ఐశ్వర్యం, ఉద్యోగం, విద్య, వీసా, వివాహం, వ్యాపారం, ప్రమోషన్‌, ట్రాన్స్‌ఫర్‌, బిడ్డలు మొదలగు వాటి కొరకే ప్రార్ధిస్తారు. ఆత్మీయ విషయాలను పూర్తిగా విస్మరిస్తారు. భూసంబంధమైన వాటి మీదే మనస్సు పెడతారు. పరసంబంధమైన వాటిని ఏ మాత్రం మనస్కరించరు (కొలస్సీ 3:1-2, ఫిలిప్పీ 3:19). శరీర సంబంధమైన విషయాలు అశాశ్వతమైనవి. ఆత్మ సంబంధమైన విషయాలు శాశ్వతమైనవి. ప్రభువు నేర్పిన ప్రార్ధనలో వీటి ప్రాధాన్యత కనబడుతుంది. 'మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము' అన్న విన్నపము 'నీ నామము పరిశుద్ధ పరచబడుగాక; నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక' అనువాటి తరువాత ఉన్నది. దేవుని మహిమ మన అవసరాలకు పైగా ఉండాలి.

దేవుని హృదయం ఎరిగినవారు, ఆలోచన కలిగి ప్రార్ధనలో తమ మనవులను తెలుపుతారు. దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకొమ్మని సెలవిచ్చినప్పుడు రాజైన సొలొమోను వివేకముగల హృదయమును దయచేయుమని కోరుకున్నాడు. ఆ కోరిక దేవుని దృష్టికి అనుకూలమైనదిగా ఉండినందున ఆయన అతనిని బహుగా ఆశీర్వదించెను (1 రాజులు 3:5-14). ఆత్మఫలము కొరకు, క్రీస్తు పోలిక కొరకు, ఆత్మవరముల కొరకు, ఆత్మీయజ్ఞానము కొరకు, మనుష్యుల ఆత్మల కొరకు, పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు, హృదయశుద్ధి కొరకు, ఆత్మీయ విషయాల కొరకు ప్రార్ధించాలి. భక్తుడైన రాబర్ట్‌ మర్రే మక్షీన్‌ పరిశుద్ధతను ఎంతో ప్రేమించాడు, దాని కొరకు ఎంతో ప్రార్ధించాడు.
మీ
3. ఆచారబద్ధంగా ప్రార్ధించుట నుండి ఆత్మీయంగా ప్రార్ధించునట్లు ఎదగాలి : పరిసయ్యులు ప్రార్ధనలో ప్రవీణులు, పలురకాల ప్రార్ధనలు చేస్తూ ప్రజల్లో పేరు గడించారు. వారి ప్రార్ధనలు ఆచారబద్ధముగా ఉండేవే కానీ ఆత్మీయముగా ఉండేవి కావు. దేవుడు వారి ప్రార్ధనలను అంగీకరించలేదు (లూకా 18:9-14). ప్రార్ధన వారికి ఆచారమే కానీ ఆనందము కాదు. భక్తితో వారు ప్రార్ధించలేదు భుక్తి కొరకు, పేరు ప్రతిష్టల కొరకు (మనుష్యులకు కనబడవలెనని) ప్రార్ధించారు. ప్రార్ధన జీవితంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఆత్మీయత నుండి మనం ఆచారంలోనికి కూరుకుపోతాం. ప్రార్ధన ఆత్మకు సంబంధించినది. అది అలవాటుగానో, ఆచారంగానో లేక యాంత్రికంగానో మారిపోకూడదు. ప్రార్ధన హృదయంలో పుట్టాలి. అక్కడనుండి పెల్లుబికి ప్రభువు సన్నిధికి చేరాలి. అలా ప్రవహించే ప్రార్ధన చాలా ప్రభావితమైనది. పెదవులతో ప్రార్ధిస్తూ హృదయం దూరంగా ఉండడం వేషధారణ! చాలా మందికి ముఖస్తుతి అలవాటైపోయింది మనస్సుస్తుతి కాదు. అర్ధం లేకుండా ప్రార్ధన చేయడం వ్యర్ధమే. సంఘాల్లో కూడ పుస్తకాల్లో నుండి వారం వెంబడి వారం ప్రార్ధనలు చదువుతారు. ఆ ప్రార్ధనల్లో మాటలు ఉండవచ్చునేమో గాని మనస్సు ఉండదు.

4. స్వంతము కొరకే ప్రార్ధించుట నుండి ఇతరుల కొరకు ప్రార్ధించునట్లు ఎదగాలి :పవిత్రమైన ప్రార్ధనలో కూడా స్వార్ధం ఉండగలదు. అనేకులు ప్రార్ధనలో తమ కొరకే ప్రార్ధిస్తారు కాని ఇతరుల కొరకు ప్రార్ధించరు. 'సాలీడ్లు తమ కొరకే పని చేసుకుంటాయి. అయితే తేనెటీగలు ఇతరుల మేలు కొరకు పనిచేస్తాయి!' నిజమైన ప్రార్ధన హృదయాన్ని విశాలపరచి, దానిని ఇతరుల కొరకు భారముతో నింపుతుంది. ఇతరుల కొరకు హృదయంలో స్థానాన్ని కల్పిస్తుంది. ఇతరుల కొరకు ప్రార్ధించుట వలన గొప్ప ఆశీర్వాదం లభిస్తుంది. యోబు తన స్నేహితుల కొరకు విజ్ఞాపన చేయగా రెండింతలు దీవెన పొందాడు. ఇతరుల కొరకు ప్రార్ధించుటలో రెండింతల ఫలం దొరుకుతుంది. ప్రార్ధింపబడిన వారితో పాటు ప్రార్ధించిన వారికి ఆశీర్వాదం ఉంది. అసంఖ్యాకమైన క్రైస్తవులు స్వార్ధపూరిత ప్రార్ధనలు చేస్తారు. వారి కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్ధిస్తారు కానీ ఇతరులను గూర్చి ఏ మాత్రం లక్ష్యముంచారు. చందమామ దాతృత్వం గలది, దాని అందమంతా దాని ఇచ్చే గుణంలోనే ఉంది. ఒకవేళ చందమామ సూర్యుని నుండి పొందిన వెలుగును మనతో పంచుకోకుండా తనలోనే దాచుకుంటే, అప్పుడేం జరుగుతుంది? చందమామ ప్రకాశించడం మానేస్తుంది. అది ప్రకాశించడం మానిన మరుక్షణమే దాని అందాన్ని కోల్పోతుంది. ఒక వజ్రం యొక్క సౌందర్యం, దాని ప్రకాశం అంతా అది పొందిన వెలుగును ప్రతిబింబించుటలోనే ఉంది. చందమామ వెలగడం మానేస్తే ఆకాశంలో ఒక పెద్ద నల్లని వికృత గోళంలా ఉంటుంది. మనం ఎవరిని పోలి ఉందాము - దేవుని ఆకాశములో నల్లని వికృత గోళంలానా లేక వెలిగే చందమామలానా?

5. శ్రమల నుండి తప్పించుకొనుటకై ప్రార్ధించుట నుండి వాటిని అధిగమించే శక్తి కొరకు ప్రార్ధించునట్లు ఎదగాలి : మానవునిది తప్పించుకునే స్వభావం. జీవితంలో అసలు శ్రమ, కష్టం, ఒత్తిడిని ఇష్టపడడు. వాటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు. విశ్వాసులు శ్రమల చేతనే శ్రేష్టులుగా మార్చబడతారు, శక్తిని పొందుతారు, శుద్ధీకరించబడతారు. వాటిని నివారించమని ప్రార్ధించుట సబబు కాదు. ఆ శ్రమలను ఎదుర్కొని, అధిగమించే శక్తిని ప్రసాదించమని దేవుని కోరుకోవాలి. గెత్సెమనే తోటలో తన మహాశ్రమకు మునుపు ప్రభువు ముమ్మారు ఆ గిన్నెను తన నుండి తొలగించమని కోరినా తరువాత తన తండ్రి చిత్తమునకు లోబడుటకు దూత చేత బలపరిచబడ్డాడు. అక్కడ ఆయన మనకు ప్రతినిధిగా ఒక మాదిరిని చూపాడు. పౌలు తన శ్రమ విషయమై ముమ్మారు ప్రభువును ప్రార్ధించినా, 'నా కృప నీకు చాలును' అని దేవుడు హామీ ఇచ్చాడు. కష్టంలోనే కృపను అనుభవించగలము. 'సుళువైన జీవితాల కొరకు ప్రార్ధించవద్దు. బలమైన వ్యక్తిగా ఉండుటకై ప్రార్ధించాలి. మీ శక్తికి సరిపడ పనుల కొరకు ప్రార్ధించవద్దు. కాని ఈ పనులకు సరిపడ శక్తికై ప్రార్ధించండి' అని అనేవాడు ఫిలిప్స్‌ బ్రూక్స్‌. శ్రమలే లేకుండా చేయమని ప్రార్ధించుట దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా ప్రార్ధించుటే. 'లోకములో మీకు శ్రమ కలుగును' అన్న ప్రభువు మాటలు ఎలా మరువగలం? అయితే ఆయన చేత బలపర్చబడి వాటిని జయించాలి.

6. మీ చిత్తానుసారముగా ప్రార్ధించుట నుండి దేవుని చిత్తానుసారముగా ప్రార్ధించునట్లు ఎదగాలి : ప్రార్ధన ద్వారా దేవుని మార్చుట కాదు మనం మార్చబడాలి. ప్రార్ధనలో మన చిత్తానికి ప్రాధాన్యత ఇవ్వక దేవుని చిత్తానికి పూర్తిగా లోబడాలి. కొందరు దేవునికి ఆయన ఏం చేయాలో, ఎలా చేయాలో చెబుతారు! వారి ఇష్టం నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తారు. దేవుని 'వేడుకోవాలి' కానీ 'వాడుకోకూడదు'. 'నీ చిత్తం నెరవేరునుగాక' అంటూనే మన చిత్తం నెరవేర్పు కొరకు ప్రయాసపడడం పాపం. క్రైస్తవునిలో ప్రార్ధన చేసే మొదటి పని అతడిని మార్చడం. అతడు తన ప్రార్ధన గదిలోనికి గర్వం, స్వార్ధం, అసూయ, కోపం, ఇష్టపాపంతో వెళ్ళినా అతడు నిజముగా, నింపాదిగా ప్రార్ధించిన తరువాత వినయం, నిస్వార్ధం, ప్రేమ, సాత్వికత, క్షమాపణలతో బయటకు వస్తాడు. ప్రార్ధన గది వెలుపల పేరు ప్రతిష్టలు, ఆస్తి అంతస్తులు, సుఖభోగాలు అన్ని ముఖ్యమైనవిగా కనబడతాయి. కాని ప్రార్ధన గదిలో మానవ విలువలన్ని వ్యర్ధమైపోతాయి. దేవునికి మన శీలము, గుణము, విధేయతే ముఖ్యం. అక్కడ దేవుని చిత్తం పాలిస్తుంది. ఆయన చిత్తము మంచిది, పరిపూర్ణమైనది, మేలుకరమైనది. అనేకుల ప్రార్ధన విఫలమై పోవుటకు కారణం ఆయన చిత్తానుసారముగా ప్రార్ధించకపోవడమే! 'ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననుదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మన మెరిగిన యెడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని యెరుగుదుము' (1 యోహాను 5:4-15).

7) మామూలు ప్రార్ధనల నుండి ఆత్మీయ పోరాట ప్రార్ధనలు చేయునట్లు ఎదగాలి : క్రైస్తవ జీవితం ఒక పోరాటం. మన నివాసం యుద్ధభూమి. మన స్థావరం శత్రువు మూక మధ్యన ఉంది. మన పోరాటం శరీరానుసారమైనది కాదు అది ఆత్మానుసారమైనది. దుష్టునితో మరియు వాని శక్తులతో ప్రార్ధనలో పోరాడాలి. ప్రార్ధన ద్వారానే మనం జయించగలము. అయితే ఆత్మీయ పోరాటం చేసే విశ్వాసులు చాలా తక్కువ. సర్వాంగ కవచము ధరించి నిత్యము ప్రార్ధనలో అపవాదితో పోరాటం జరగాలి. ప్రార్ధన ద్వారానే వానిని ఎదురించి, వాని ఆటలు కట్టించగలం. 'ప్రార్ధన ఆత్మకు కవచం, దేవునికి యాగం, మరియు సాతానుకు కొరడా!' అన్నాడో భక్తుడు. ఈ దినాల్లో తోకముడుచుకు పరిగెత్తే వారే ఎక్కువ కనబడుతున్నారు కాని ప్రార్ధన కొరడా ఝుళిపించి సాతానును పరిగెత్తించే వారు తక్కువ.

పాలబుడ్డి ప్రార్ధనలను వీడి పోరాట ప్రార్ధనలకు మనం ఎదగాలి. ఉరుగ్వే మరియు బ్రెజిల్‌ ఇరుగు పొరుగు దేశాలు. ఆ సరిహద్దులో ఒక వ్యక్తి కరపత్రాలు పంచుతున్నాడు. కేవలం రెండు దేశాలకు మధ్య ఒక రోడ్డు వాటిని వేరు చేస్తోంది. ఉరుగ్వే వైపు వారు కరపత్రాలను చిరునవ్వుతో తీసుకున్నారు. కాని బ్రెజిల్‌వైపు వారు వాటిని కోపంతో చించి వేసారు. కారణం ఉరుగ్వేలో ఆత్మీయ పోరాటం జరుగుతోంది. అక్కడ విశ్వాసులు ప్రార్ధనలో సాతానుపై విజయం సాధించారు. చక్కటి ఫలితం దక్కింది. బ్రెజిల్‌లో ఆ పరిస్థితి లేదు. అమాలేకీయులపై యెహోషువ జయం సాధించుటకు మోషే ప్రార్ధన కారణం (నిర్గమకాండం 17). సాతానుకు బెదరక, అదరక, పవిత్ర జీవితం కలిగి, ప్రభువును హత్తుకుని, వానిని ప్రార్ధనాయూధం ద్వారా హతమార్చండి! ప్రార్ధనలో ఆత్మీయ పోరాటం జయాన్నిస్తుంది.

'ప్రియులారా, ఎక్కువ ప్రార్ధన చేయకుండా మీరు పరలోకానికి వెళ్ళవచ్చు. రోజు కేవలం ఒక్క నిమిషం మీరు ప్రార్ధించినా దేవుడు మిమ్మును ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రార్ధనలకు, 'భళా నమ్మకమైన మంచి దాసుడా' అనే ప్రశంస మీరు వినరు. సాతాను స్థావరమున్న స్థలములలో అటువంటి ప్రార్ధనలతో మీరు సమృద్ధిగల జీవం కలిగి ఉండలేరు. నూతన నిబంధనలలో పౌలు ప్రార్ధనలను చదవండి. మీరు అలా ప్రార్ధించగలరా? ఆలోచించండి' అని వ్రాసాడో భక్తుడు. నేటి నుండే మీ ప్రార్ధన జీవితం సరి చేసుకుని, సమర్ధవంతమైన ప్రార్ధన అనుభవంతో ప్రభువు రాక కొరకు కనిపెట్టండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ప్రార్ధనాత్మను దయ చేయును గాక! -

ప్రభువు సౌందర్యం

 

పరమగీతము 5వ అధ్యాయం 11వ వచనం నుండి 16వ వచనం వరకు
అతని శిరస్సు అపరంజివంటిది

అతని తలవెండ్రుకలు కాకపక్షములవలె కృష్ణవర్ణములు అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి.

అతని నేత్రములు నదీతీరములందుండు గువ్వలవలె కనబడుచున్నవి. అవి పాలతో కడుగబడినట్టున్నవి అవి చక్కగా తాచిన రత్నములవలె ఉన్నవి.

అతని చెక్కిళ్లు పరిమళ పుష్పస్థానములు సుగంధవృక్షములచేత శోభిల్లు ఉన్నత భూభాగములు

  అతని పెదవులు పద్మములవంటివి ద్రవరూపక జటామాంసివలె అవి పరిమళించును.

అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళమువలె ఉన్నవి

అతని కాయము నీలరత్నఖచితమైన విచిత్రమగు దంతపుపనిగా కనబడుచున్నది.

అతని కాళ్లు మేలిమిబంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభములవలె ఉన్నవి.

అతని వైఖరి లెబానోను పర్వతతుల్యము అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము.

అతని నోరు అతిమధురము. అతడు అతి కాంక్షణీయుడు

యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు.

పైవచనాలలో ప్రభువైన యేసులో పది విధములైన సౌందర్యం కనిపిస్తుంది. ఇది సాటిలేని సౌందర్యం. శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రభువు సౌందర్యము మనం గమనిస్తాం. ఆ సౌందర్యాన్ని ఇపుడు మనం ధ్యానింపబోతున్నాం.

1. 5:11 ప్రభువు యొక్క శిరస్సు : ప్రభువు యొక్క శిరస్సు ఆయన శిరసత్వాన్ని సూచిస్తుంది. కొలస్సై 1:18 లో సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు అని చదువుతాం. ఎఫెసి 5:23 లో క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్నాడని గమనిస్తాం. ఎఫెసి 2:20 లో క్రీస్తు ప్రభువే ముఖ్యమైనవాడు, శిరస్సు వంటి వాడని చదువుచున్నాం. ఎఫెసి 4:16లో ఆయన శిరస్సైయున్నాడని గ్రహిస్తాం. 1 కొరింథి 11:3లో ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తని వ్రాయబడి వుంది. ప్రభువు శిరస్సై యున్నాడు.



ప్రభువు శిరసు బంగారము వంటిది. బంగారము జ్ఞానమునకు సాదృశ్యం. యోబు 28:12లో జ్ఞానమును గూర్చి ప్రశ్న వేశాడు. 16వ వచనంలో అది బంగారము కంటె శ్రేష్టమైంది అన్నాడు. మన శిరస్సైయున్న ప్రభువు శిరసులో బంగారము కంటె శ్రేష్టమైన జ్ఞానముంది. అలాంటి జ్ఞానము కల్గిన ప్రభువు మనలను నడిపించుటకు సమర్ధుడు.

2. అతని తలవెంట్రుకలు : ఇంతకు ముందు ఆయన తలపైన పరిశుద్ధాత్మ (మంచు) వున్నదని మనం నేర్చుకున్నాం. ప్రభువు తలవెంట్రుకలు, ఆయన సమర్పణకు, నజీరు జీవితమునకు సాదృశ్యంగా వున్నవి. నల్లని వెంట్రుకలు బలమునకు, సౌందర్యమునకు సాదృశ్యము. ఆయన బలవంతుడైన దేవుడు. బలహీనులమైన మనకు ఎల్లప్పుడు సహాయం చేయగలడు.

నల్లని వెంట్రుకలు మార్పులేని జీవితాన్ని సూచిస్తున్నాయి. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా వున్నాడు. మార్పులేని దేవుడు మనం అనేకసార్లు నీళ్ళవలె చంచలంగా వుంటాం.

3. 5:12 : ప్రభువు యొక్క నేత్రములు : ప్రభువు యొక్క నేత్రములు పాపమును చూడలేనంత పరిశుద్ధమైనవి. ఆయన పరిశుద్ధమైన నేత్రములు గలవాడు. ప్రభువు బిడ్డలమైన మన చూపులు అంత పరిశుద్ధంగా ఉండాలి. కీర్తన 33:13లో 'ఆయన దృష్టి నరులందరి మీద వుందని ఆయన అందరిని కనిపెట్టుచున్నాడని' మనం నేర్చుకుంటున్నాం. ఆయన కనుదృష్టి తన భక్తులపై వుందని నేర్చుకుంటున్నాం. తన భక్తులను ఆయన మరణం నుండి తప్పిస్తాడు. ఆయన భక్తులవైపు ఆయన చూస్తున్నాడు. (కీర్తన 34:15)

4. అతని చెక్కిళ్ళు : ప్రభువు చెక్కిళ్ళు ఎంతో శ్రేష్టమైనవి. మన పాపముల నిమిత్తం అవి కొట్టబడినవి. విలాప 3:30లో చెప్పబడినట్టు ప్రభువు తనను కొట్టువారి తట్టు తన చెంపను త్రిప్పాడు. మీకా 5:1 చెప్పబడినట్లు ఇశ్రాయేలీయుల అధిపతియైన ప్రభువును కర్రతో చెంపమీద కొట్టారు. మార్కు 14:65లో యోహాను 18:22లో కొట్టువారికి తన చెంపలను, పెరుకువారికి గడ్డములను అప్పగించాడు. ఇప్పుడైతే ఆనంద తైలముతో అభిషేకించబడిన చెంపలు గలవాడై సువాసనలు వెదజల్లుచూ అన్ని నామములకు పై నామముగా తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై యున్నాడు. ప్రతిష్ఠిత తైలము సుగంధ వృక్షముల నుండి తయారు చేయబడిన తైలము ఆయన తలమీద పోయబడగా అది ఆయన చెక్కిళ్ళపైనుండి పరిమళిస్తుంది.

5. 5:13 అతని పెదవులు : అతని పెదవులు - అనగా ప్రభువు పెదవులు పద్మముల వంటివి. పద్మములెంత సౌందర్యముగా వుంటాయో అంత సౌందర్యము గలవి. పద్మములు తెల్లగా నుండునట్లు ఆయన పెదవులు పరిశుద్ధమైనవి.

యెషయా 50:4 వచనంలో ప్రభువు పెదవులను గమనిస్తున్నాం. అలసిన వానిని మాటలుచేత ఊరడించే పెదవులు ప్రభువు కల్గి వున్నాడు. ఆయన మాటలు శ్రేష్టమైనవి. నెమ్మదిని కల్గించేవి. కీర్తన 45:2లో ఆయన పెదవుల మీద దయారసము పోయబడియున్నదని మనం నేర్చుకుంటున్నాం. లూకా 4:22లో ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ప్రజలు ఆశ్చర్యపడ్డారు. 2కొరింధి 12:9లో ఆయన పెదవులనుండి కృప మనకు కలుగుతుంది.

6. 5:14 ఆయన కరములు : ప్రభువు చేతులు మన పాపముల నిమిత్తం పొడవబడినవి. ఆయన పునరుత్థానుడైన తర్వాత ఆయన చేతులలో మేకులు గురుతులు, ఆయన ప్రక్కలో బల్లెపు పోటు గురుతులు (యోహాను 20:25) వున్నవి. అయితే యిప్పుడు ప్రభువు చేతులు మహిమలో వున్నాయి. తర్షీషులో దొరికే రత్నముల చేత అలంకరింప బడినట్లున్నాయి. అవి గోళపు ఆకారములో వుండి పాపులను ఆయన బిడ్డలను కౌగలించుకొనుటకు సిద్ధంగా వున్నాయి. ఆయన తన ప్రజలకు నిత్యజీవాన్ని దయచేశాడు. స్వర్ణగోళముల వలెనున్న ఆయన చేతులలో నుండి ఆయన గొర్రెలను ఎవడును అపహరించలేడు. ఆది 49:24లో చెప్పబడినట్లు దేవుని పరాక్రమ హస్తములు ఆయన ప్రజలను కాపాడుతూ వుంటాయి.

7. అతని కాయము - శరీరము : 'శరీరము' అనే మాట ఆయన 'ఉదరము' (పొట్ట) అని అర్ధమిస్తుంది. మూలభాషలో అంతరింద్రియమునకు ఇది సాదృశ్యము. ఈ అంతరింద్రియములో ప్రేమ, దయ, కృప, నిలిచి వుంటాయి. యిర్మియా 31:20లో దేవుని కరుణను మనం గమనిస్తున్నాం. అందువల్ల దేవుడు కరుణ గలవాడని ప్రేమగలవాడని, మన కర్ధమగుచున్నది. మత్తయి 9:36లో ప్రభువు ప్రజలవైపు చూచి వారు కాపరి లేని గొర్రెల వలె వున్నందున వారిమీద కనికరపడ్


ఆయనతో నడక సాధ్యమా !



ఆయనతో కలిసి నడవటానికి మనకు కావలసింది సంపూర్ణ విధేయత. ఇదే మనలను దేవునితో సహవాసం కలిగి ఉండేట్లు, మనం పరిశుద్దతలో కొనసాగేలాగా చేస్తుంది. ఆది 5:22 - "హనోకు దేవునితో నడిచేను" అనే మాట మనం చదివిన ప్రతి సారి మనలో యేవో ఆలోచనలు..... బిగ్గరగా ఊపిరి పీల్చుకుని..... ప్చ్..... అంటూ శబ్దం చేసి, కుర్చీలో వెనక్కి వాలి, శూన్యంలోకి చూస్తుండిపోతాము. వచనమే గాదు వచనమైనా మనలను నిరాశపరచేందుకు కాదు, బలపర్చెందుకే వ్రాయబడిందని మర్చిపోవద్దు. వాక్యం ఆహారం కదానడక అనే మాట..... మనల్ని ఎంతో ఆలోచింపచేస్తుంది గాని అది స్వతహాగా.... సహవాసాన్ని చూపిస్తుంది. అంటే కలిసి నడవటం అంటే సహవాసం కాక ఇంకేమిటో మీరే చెప్పండి? మీరు ఎదురు దాడికి దిగారు. గానీ దీనినేలా సమర్ధిస్తారు? సర్, నా మాట వినండి,మనం కలిసి నడుస్తున్నాం అంటే మనం ఇద్దరం, అవునా? అంటే కలిసి నడిస్తే.... ఒకటిగా నడవటం కదా? కలిసి ఒకటిగా ఉండగలగటాన్ని ఏమంటాం? మీరే చెప్పండి? సహవాసం కాదా? హనోకు దేవునితో సహవాసం చేసాడు, అర్ధం తప్పిపోయిందా? పరిస్థితులు ఎలా ఉన్నా దేవునితో సహవాసం చేసాడు. అంటే నడిచాడనే గదా. ఇది మనకెంతో ప్రోత్సాహాన్ని, ఆదరణను, దైర్యాన్ని ఇస్తుంది. ఏలీయా మనవంటి మానవుడే అయినప్పుడు హనోకు సహితమ మనవంటి వాడే గదా? హెబ్రి 11:5 - మనలో ఉన్నది.... పరిశుద్దాత్మ దేవుడు అనుగ్రహించిన విశ్వాసమే. 1 కొరింథీ 12:9 హనోకు కలిగి ఉన్నది అదే విశ్వాసం. హనోకు విశ్వాసం వలన దేవునికి ఇష్టుడయ్యాడు. మరి మనలో గల విశ్వాసం వల్లనే మనమూ దేవునికి ఇష్టులం అయ్యాం. మనకు హనోకుకు తేడా లేదంటారా? విశ్వాసం ఒక్కటే. దేవుని వద్దకు వచ్చిన వారికీ, హనోకుకు ఉన్నది ఒక్కటేనని వచనం స్పష్టంగా చెబుతుంది. "ఆయన ఉన్నాడని" వెదకినవానికి ఫలం దయచేస్తాడని నమ్మాలి కదా? ఇది సామాన్యమైన విశ్వాసాన్ని గురించే చెబుతుంది గానీ విశ్వాసాల్లో గల వ్యత్యాసాన్ని గురించి చెప్పడం లేదు. అందుచేత విశ్వాస విషయం లో తేడా లేదు. మరి? అదే చెబుతున్నానుఆమోసు 3:3 - సమ్మతింపక ఇద్దరు కూడి నడతురా? సహవాసానికి, కలిసి నడవటానికి (సహవాసాన్ని కొనసాగించడానికి) కావలసింది ఇదే. ఇక్కడే మనకు హనోకుకు వ్యత్యాసం ఉంది. కొంచెం స్పష్టంగా చెబితే బాగుంటుందేమోఅపొ॥ 15:36 -39 ఉదాహరణకు పౌలు, బర్నబాలు కలిసి సేవ చేసారు, కలిసి ఉన్నారు, ఒక్కటే సహవాసం అంటే కలిసి నడిచారు, అవునా? కాని మార్క ను వెంట తీసుకువెళ్ళే దగ్గర? ఏం జరిగింది? ఇద్దరికీ అభిప్రాయ బేధం వచ్చింది. సమ్మతి కుదరలేదు, ఇద్దరి నడక వేరు అయిందిఅనేక విషయాల్లో లేఖనం యొక్కఆదేశాలను మనం ఒప్పుకుంటాం కానీ నెరవేర్చే దగ్గర కాదన్నట్లుగా మన ప్రవర్తన ఉంటుంది. ఇద్దరం మనుష్యులమే అయితే గుర్తించలేకపోవచ్చు. పరిస్థితి తీవ్రమయ్యాక.... అప్పుడు గుర్తిచటం.... కానీ సహవాసం దేవునితో గదా. ఆయన మనుష్యుని ఆంతర్యం ఎరిగినవాడు, ఆయనతో కలిసి నడవటానికి మనకు కావలసింది సంపూర్ణ విధేయత. ఇదే మనలను దేవునితో సహవాసం కల్గి ఉండేట్లు, మనం పరిసుద్ధతలో కొనసాగేలా చేస్తుందిహనోకు వలన మనకు లభించే ధైర్యం ఏమిటి? మొదటి ధైర్యం - మానవుడు దేవునితో సహవాసం చెయ్యగలడు. ఇది సాధ్యమౌతుంది అనే యదార్ధత మానవాళికి ధైర్యమిస్తుంది. మనం ఇతరులకు పనికి రాకపోవచ్చు, మనలను ఇతరులు అంగీకరించకపోనూవచ్చు కానీ విశ్వాసం వలన దేవునికి ఇష్టులమైన మనం, ప్రార్ధనా సహవాసంలో ఆయనతో కొనసాగగలం. ఆయన మనతో సహవాసం చేసేందుకు మన వద్దకు వస్తారు, ఇదెంతటి ఆదరణఅయ్యో మోషే మేము ఆయన స్వరము వినిన యెడల చనిపోయేదమేమో, నీవే మాతో మాట్లాడుము అనే మధ్యవర్తిత్వపు సహవాసం కాక, నేరుగా ప్రతి మానవునితో సహవాసం చేస్తారనే అమూల్యమైన యదార్ధత, యదార్ధ సహవాసం మనకు హనోకు జీవితంలో కనిపిస్తుంది. మన జీవితాల్లో లేనిది ఇదే గదా? మనం దేవునితో సహవాసం చేయటం కరువైంది, మన దృష్టి మనుష్యులపైనే ఉంది. పరిస్థితులపైనా ఉంది, ధనం వచ్చే దారులపై ఉంది, అన్నింటినీ సమకూర్చే దేవునితో సహవాసం చెయ్యటంపై లేకపోవడం ఆధునిక క్రైస్తవుని దుస్థితి. అయ్యో! ప్రభువా! క్షమించు, మరలా నీతో సహవాసం చేసేందుకు నాలో ఆకలి పుట్టించు. నాతో కలిసి నడిచేందుకు నీవు ఇష్టంగానే ఉన్నావు, ఇందుకు నాలోని సామాన్య విశ్వాసమే కారణం అంటూ మనం ప్రభువు పాదాల వద్దకు వెళదాంరెండవ ధైర్యం - ఆది 5:22. మానవుని సహజ అభిప్రాయం,కుటుంబంతో దైవికంగా ఉండడం సాధ్యం కాకపోవచ్చును, అని. అనేకమంది -వివాహం చేసుకోకపోతే ఎంత బాగుండును? హాయిగా దేవునితో, దేవుని సేవలో ఉండేవాడ్ని. నన్నెవరు ప్రశ్నిస్తారు, ఎవరు అడ్డగిస్తారు? అని..... అనుకుంటారు. ఇది కేవలం అపోహ మాత్రమే. వివాహం లేనివాళ్లకు వాళ్లకుండే అడ్డంకులు, శరీర సంబధమైన, మానసిక సంబంధమైన అడ్డంకులు వాళ్లకూ ఉంటాయి. దేవునితో నడిచేందుకు సంసారం, సంసారిక జీవితం అడ్డంకి కాదని, అతడు దేవునితో నడుచుచూ కుమారులను, కుమార్తెలను కనెను {ఆది 5:22} అనే వచనం ధైర్యాన్ని, బలాన్ని కలిగిస్తుంది. కుహనా ఆలోచనాపరులు సంసారం చేసి ప్రార్ధన చెయ్యటం... వాక్యం చెప్పటం.... మంచిది కాదనే అభిప్రాయాలను విడిచిపెట్టుకోవాలనీ, అది తప్పు అభిప్రాయం మాత్రమేనని స్పష్టంగా బోధపడుతుంది. ఉపవాసం విషయంలోనే పౌలుగారు నియమం చెప్పారు, అంతవరకేమూడవ ధైర్యం - ఎవ్వరూ లేకపోయినా అధైర్యపడనవసరం లేదనీ, నీతో దేవుడుంటాడని, ఆయన నిన్ను విడువని వాడనీ, పరిసుద్ధతను నీవు ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడని, ఆయనతోడు సదా నీతో ఉంటుందని, అంతరంగంలో యదార్ధతను ఆయన కోరుకుంటాడు గనుక యదార్ధత ఇద్దరినీ సమ్మతి పరుస్తుందని, స్పష్టంగా అర్ధమై ధైర్యం లభిస్తుంది. లేఖనం ఇంకా వ్రాయబడలేదు అంటే వ్రాయబడిన వాక్యం ఆయన చూడలేదు. నేను చదువలేను ఎలా? నాకు చదువురాదు గదా? అనే వాళ్లందరికీ ధైర్యాన్నిచ్చే సందర్భం కూడా ఇది. చదువు హనోకుకు రాదని కాదు సుమా! చదవటం ఎంతైనా అవసరం. ప్రార్ధనకు వాక్యం ఆధారం అయినా దేవుని గురించి చెప్పే ఆదాము, షేతుల అనుభవాలు, చరిత్ర నేర్పిన పాఠం.... ఇవి హనూకుకున్నాయి. అపొ॥ 14:17- ప్రతి తరంలోనూ ఆయన తన నిమిత్తమై సాక్ష్యం అట్టిపెట్టుకోకుండా లేడు. హెబ్రీ 11:6- నేటికీ ఆయనను వెదికే వారికి సమీపంగా ఉండే దేవుడు, బయలుపర్చుకునే దేవుడు కూడా. ఇదెంతటి ధైర్యాన్నిస్తుంది. నాల్గవ ధైర్యం - యూదా 14,15. ప్రపంచం నిండా భక్తిహీనతే తాండవించినా, దేవుని గురించిన స్పృహ గలవారు ఒక్కరు కూడా లేకపోయినా, దేవుని ఉనికిని ప్రశ్నించే హేతువాద సంఘాలు విస్తరించినా, దేవునితో సహవాసం చెయ్యటం సాధ్యమే. ఎన్ని ప్రతికూలతలున్నా, ఎందరు విరోధంగా మాట్లాడినా, ఆయన అందరికీ కనబడకపోయినా, అందరితో మాట్లాడకపోయినా, విశ్వాసముంచిన నీతో సహవాసం తప్పక చేస్తారని, భూమ్మీద నిన్ను ఆయన తన సహవాసిగా కోరుకున్నారని అర్ధం అవుతుంది గదా, ఇది మన ధైర్యంఅందరికీ ఆయన కనిపిస్తే మంచిదే గదా? ఒకసారి సాధు సుందర సింగ ప్రభువుతో ప్రభూ! నీవు అందరికీ కనిపిస్తే, మాట్లాడితే వాళ్లంతా నమ్ముతారు కదా? అని ప్రశ్నించానని..... అయితే ప్రభువేం అన్నారు? ముప్ఫై మూడున్నర సంవత్సరాలు నేను అందరికీ కనిపించాను, అందరితో మాట్లాడాను గదా, ఎందరు నమ్ముకున్నారు? అని బదులు ప్రశ్నించారని, తానేం మాట్లాడక మౌనినయ్యానని తన అనుభవాన్ని చెప్పాడుదేవునితో వ్యక్తిగత సహవాసం అన్ని పరిస్థితుల్లో సాధ్యమౌతుందని, మనకు ఆయనతో మాట్లాడే మనస్సుంటే ప్రార్ధనలో, వాక్య ధ్యానంలో మనం ఆయనతో చక్కటి సహవాసం చెయ్యటం వీలవుతుందనే ధైర్యం హనోకు జీవితం ద్వారా మనకు లభ్యమౌతుందిఐదవ ధైర్యం - మనుష్యుల వైపు చుస్తే.... నిరాశపడవలసి వస్తుంది. ఇది చారిత్రక సత్యం. భక్తిహీనత, భక్తిహీన క్రియలు, దేవునికి విరోధంగా మాట్లాడేవాళ్లుయూదా 14,15 తమ తమ దురాశల చొప్పున నడుచుకునేవాళ్లు, మనుష్యులను ముఖస్తుతి చేసేవాళ్లు, సనిగేవాళ్ళు, తమ పరిస్థితికి దేవుని నిందించేవాళ్లు, డంబమైన మాటలు పలికేవాళ్ళు.... హనోకు నివశిస్తున్న ప్రాంతంలో బహుగా విస్తరించి ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. అయినా హనోకు భవిష్యత్తులోనికి దృష్టి సారించి ఆయన వైపే చూడటం ద్వారా వీటన్నింటి ప్రభావం నుండి బయటపడి, ఆయనతో అమూల్యమైన సహవాసాన్ని చేసాడు. ఏకదృష్టి గలవాడై.... మనకు నేటి తరంలో వర్తమానమయ్యాడుహెబ్రీ 12:2 - మనం కూడా విశ్వాసమునకు కర్తయూ, దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూస్తూ, లోక ప్రభావం నుండి విడిపించబడుతూ, ఆయన సన్నిధిని అనుభవిస్తూ..... ఆయనతో నడిచే కృపను కొనసాగించుకొందుము గాక, ఆమెన !